శ్రీశైలం జలాశయానికి శుక్రవారం కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. 8 గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 2,58,612 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,81,398 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత మట్టం 882.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.