శ్రీశైలంలో డిసెంబర్ 1 నుంచి ఉచిత లడ్డూ పంపిణీ

శ్రీశైలం దేవస్థానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1 నుంచి రూ. 500, రూ. 300 టికెట్ తీసుకున్న వారికి ఉచిత లడ్డూ ప్రసాదం అందించే కొత్త కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు శుక్రవారం వెల్లడించారు. దీంతో పాటు నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్‌ను ప్రారంభించడంతో పాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్