రేపటి నుంచి శ్రీశైలంలో ఉచిత, స్పర్శ దర్శనాలు రద్దు

శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉంది. రద్దీ దృష్ట్యా 15వ తేదీ నుంచి 18 వరకు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలిపేశారు.

సంబంధిత పోస్ట్