కర్నూలు: శ్రీశైలంలో ఉచిత యోగా శిక్షణ

శ్రీశైలం చంద్రవతి కల్యాణ మండపంలో బుధవారం ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతీ మంగళ, బుధవారాల్లో జరిగే ఈ శిక్షణకు 150 మందికి పైగా హాజరయ్యారు. ప్రముఖ యోగాచార్యుడు గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి యోగాసనాలు, ప్రాణాయామాలు నేర్పించారు. దేవస్థానం సిబ్బంది, భక్తుల కోసం ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్