శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇన్‌ఫ్లోగా 2,93,609 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఔట్‌ఫ్లో 2,82,502 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.