మహానందిలో ఈదురుగాలులతో వర్షం.. రైతుల ఆందోళన

మహానంది మండలంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా వాతావరణం మారడంతో పొలాలు, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోకుండా రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బొల్లవరం, తమ్మడపల్లె, బుక్కాపురం గ్రామాల్లో నిల్వ ఉంచిన ధాన్యంపై ప్రభావం పడే అవకాశంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం తమకు నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్