మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మన పసుపు పండుగ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పార్టీ జెండా ఆవిష్కరించి, ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ విషయాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.