శ్రీశైలం నియోజకవర్గంలో ఘనంగా మహానాడు వేడుకలు

ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్టీఆర్, బుడ్డా వెంగళరెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం కరివేన గ్రామంలో జరిగిన క్లస్టర్-4 మహానాడులో మహిళా కార్యకర్తలను సన్మానించారు. రాధాపురం రాస్తా క్లస్టర్-3, వేల్పనూరు క్లస్టర్-8 కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి దోహదపడ్డాయి.

సంబంధిత పోస్ట్