రైతులకు ఇబ్బందుల్లేకుండా యూరియాను పంపిణీ చేస్తామని, రసాయనిక ఎరువులు అధిక ధరలకు విక్రయించరాదని, ప్రైవేటు డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలోని సహకార సొసైటీ ద్వారా రైతులకు పంపిణీ చేసే యూరియా నిల్వలను తనిఖీ చేశారు. సొసైటీ సీఈవో వెంకటస్వామి, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.