కూటమి ప్రభుత్వం వితంతువులకు నూతన పింఛన్లు అందజేస్తూ ఆర్థిక భరోసా ఇస్తుందని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు పేర్కొన్నారు. శుక్రవారం మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్లను సర్పంచ్ శ్రీలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తిమ్మాపురం, అబ్బీపురం తదితర గ్రామాల్లో నూతనంగా మంజూరైన వితంతువు పింఛన్లను అధికారులు నాయకులు పంపిణీ చేశారు.