మహానంది: మహిళల భద్రత కోసం శక్తి యాప్

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్ రూపొందించిందని, శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అత్యవసర సమయంలో సహాయం పొందవచ్చని నంద్యాల హెడ్ కానిస్టేబుల్లు ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం తిమ్మాపురం, బుక్కాపురం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నంద్యాల ఏఎస్పి జావలి ఆధ్వర్యంలో శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్