మహానంది: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మహానందిలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు, హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలు ప్రజల భద్రత కోసమేనని తెలిపారు.

సంబంధిత పోస్ట్