ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మహానందిలో గత 60 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 60,18,167 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అభిషేక మండపంలో ఉభయ దేవాలయాల హుండీ కానుకలను లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల ఆదరణతో ఆలయ ఆదాయం గణనీయంగా నమోదైనట్లు ఈవో పేర్కొన్నారు.