మహానంది క్షేత్రం భక్తులతో కిటకిట (వీడియో)

బుధవారం మహానంది దేవస్థానం భక్తులతో కళకళలాడింది. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ పుష్కరిణుల్లో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పరిసరాలు సందర్శకులతో నిండిపోయాయి. మహానంది క్షేత్రంలో వివాహాలు కూడా నిర్వహించబడడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్