మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

మహానంది పుణ్యక్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఆహ్వాన పత్రికలను ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, వేద పండితులు రవిశంకర్ అవధాని, సూపరింటెండెంట్లు, విలేకరులు పాల్గొన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించారు.

సంబంధిత పోస్ట్