శ్రీశైలం గర్భగుడిలో హుండీ చోరీలో వ్యక్తి అరెస్ట్

శ్రీశైలం దేవస్థానంలోని గర్భగుడి హుండీలో భక్తులు వేసిన నగదును దొంగలించిన పరిచారకుడు హిరెమత్ విద్యాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం రూ. 3. 79 లక్షలు దొంగలించినట్లు విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రూ. 1. 24 లక్షల నగదు, బులెట్ బైక్ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

సంబంధిత పోస్ట్