శుక్రవారం శ్రీశైలం డ్యాం సమీపంలోని పాతాళగంగలో స్నానం చేస్తున్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడకు చెందిన యాదయ్య (45) అనుకోకుండా లోతైన నీటిలో పడి మృతి చెందాడు. దర్శనార్థం వచ్చిన ముగ్గురిలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు.