వెలుగోడులో రైతన్నా మీకోసం పర్యటనలో ఎమ్మెల్యే బుడ్డా

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శనివారం గుర్రంపేట కాలనీలో ఇంటింటికి వెళ్లి రైతులకు ప్రభుత్వ పథకాలను వివరించారు. ముఖ్యంగా పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు రైతుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న లబ్ధుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్