బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో సోమవారం సంచార వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏమంత సమీరా వైద్యాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ వైద్యాధికారిగా పనిచేస్తున్న కిరణ్ కర్నూలు జిల్లా అర్ధగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన హేమంతా సమీరా తొలిసారి లింగాపురం గ్రామంలో సంచార వైద్య శిబిరాన్ని నిర్వహించారు.