కాలినడకన తిరుమలకు ఎంపీ బైరెడ్డి శబరి

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి అలిపిరి నుంచి కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున బయలుదేరిన ఆమె మధ్యాహ్నం తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్