ఆత్మకూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం చైర్మన్ డాక్టర్ ఆసియా ఆధ్వర్యంలో జరిగింది. రూ. 72 లక్షల అభివృద్ధి పనులు అజెండాలో చైర్మన్‌కు తెలియకుండానే చేర్చడంపై కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లకు వేతనాలు, గత దశాబ్దపు బకాయిల చెల్లింపు అంశాలపైనా తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. మూడు అజెండాలు వాయిదా పడ్డాయని వారు తెలిపారు.