నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కళ్ళు మూసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.