ఏడాది పాలనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.