ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తోంది. గురువారం ఉదయం నాటికి జురాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,81,051 క్యూసెక్యుల మేర వరద శ్రీశైలం డ్యాంకు వస్తోంది. దీంతో డ్యాం మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 80,646 క్యూసెక్యులు, డ్యాం ఎడమ, కుడి గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.