శ్రీశైలం డ్యామ్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి శుక్రవారం 1, 60, 843 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దాంతో జలాశయం 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుతం 882. 80 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత పోస్ట్