పరిశపోగు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు: రోగులకు పండ్లు పంపిణీ

నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను శ్రీశైలం మండలంలో ఘనంగా నిర్వహించారు. పాత మార్కెట్ సెంటర్‌లో కేక్ కట్ చేసిన నాయకులు, అనంతరం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాదిగ జాతి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం శ్రీనివాసరావు చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం మండలం అధ్యక్షులు వేషపోగు కమలాకర్, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి ప్రసన్న, కోశాధికారి రాజ్ కుమార్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్