ప్రజల విశ్వాసమే బలంగా ముందుకు: బీసీ జనార్దన్ రెడ్డి

బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 25566 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన స్పందించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. బనగానపల్లెను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్