నంద్యాల పట్టణంలో మైనర్లు వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది మైనర్లను గుర్తించి, ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 1.5 లక్షల జరిమానా విధించారు. మైనర్ల తల్లిదండ్రులకు చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించి, మైనర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు.