మహానందిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

మహానంది మండలం గ్రామాల్లోని అన్ని సబ్స్టేషన్లలో 5 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రెండవ శనివారం సందర్భంగా, విద్యుత్ సబ్స్టేషన్లలో మెయింటెన్స్ కారణంగా, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. అలాగే రైతులకు త్రీఫేజ్ సప్లై రాత్రి 12 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్