మహానందిలో వర్షాలు.. రైతులకు పెరుగుతున్న ఆందోళన

మహానంది మండలంలో మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం కూడా మోస్తరు వర్షం కొనసాగింది. దీనితో అరటి పంటలు నేలకూలే ప్రమాదం ఉందని, ఆరబోసిన మొక్కజొన్న తడిసి నష్టపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్