నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీవో ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రమేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జూపాడుబంగ్లాకు చెందిన రైతు ఈశ్వరయ్య నుంచి పొలం పాస్ పుస్తకాలకు సంబంధించి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అడ్డుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐ కృష్ణయ్య, ఎస్ఐ సుబ్బరాయుడు పాల్గొన్నారు.