మహానంది మండలం పుట్టుపల్లి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు పెద్ద నాగన్న (85) మృతికి నంద్యాల జిల్లా సీపీఐ సమితి సంతాపం తెలిపింది. ఆయన మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. భూపోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.