శ్రీశైలం దేవస్థానంలో మార్చి 16 నుండి 20 వరకు జరిగే ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు సోమవారం సమీక్ష నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుగానే ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మార్చి 6 నుండి 15 వరకు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనం, ఉత్సవాల సమయంలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని ఈవో తెలిపారు.