అమలాపురం డొంగు రోడ్డుకు సీసీ మంజూరు: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామంలో వర్షాకాలంలో బురదమయంగా మారే డొంగు రోడ్డు సమస్యను టీడీపీ నాయకులు రవింద్ర బాబు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి, డొంగు రోడ్డు నుంచి స్మశానం వరకు సుమారు కిలోమీటర్ మేర సీసీ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ మంజూరు చేశారు. ప్రస్తుతం మెటల్ వేసే పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు పూర్తయితే వర్షాకాలంలోనూ స్మశానం, మంచినీళ్ల బోరుకు సులభంగా చేరుకోవచ్చని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్