శ్రీశైలంలో లోకకల్యాణం కోసం అంకాళమ్మ వారికి విశేష పూజలు

శ్రీశైలంలో లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామదేవత అయిన అంకాళమ్మవారికి శుక్రవారం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతీ శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా శ్రీఅంకాళమ్మవారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది.

సంబంధిత పోస్ట్