మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారికి సోమవారం సందర్భంగా వైభవంగా పల్లకి సేవ సోమవారం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి, ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజలు అనంతరం ఆలయ ప్రాంగణంలో మేళతాళాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు సుబ్బారెడ్డి, అధికారులు భక్తులు పాల్గొన్నారు.