శ్రీశైల మల్లన్న ఆలయం శనివారం భక్తులతో కళకళలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ముందుగా పాతాళగంగలో స్నానం చేసి, స్వామి, అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో నిలిచారు. ఉచితం, శీఘ్రం, అతి శీఘ్ర దర్శన మార్గాలు భక్తులతో నిండి పోయాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఏర్పాట్లు చేసింది.