శ్రీశైలం: రైతన్నా కోసం పరమటూరులో ఎమ్మెల్యే రాజన్న పర్యటన

శనివారం బండి ఆత్మకూరు మండలం పరమటూరులో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పర్యటించారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అందిస్తున్న లబ్ధులు, పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్