శ్రీశైలం జలాశయానికి శనివారం వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,37,635 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 94,497 క్యూసెక్కులు ఉంది. మూడు గేట్లు మూసివేసి, ఒక్క గేటు ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.