శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో తెలుగుగంగ జలాశయం నుంచి మద్రాసు కాలువకు నీటిని మంగళవారం విడుదల చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ నీటి విడుదలతో ఆయకట్టు రైతులకు భారీగా లాభం చేకూరనుందని వారు తెలిపారు.