గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చనున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆత్మకూరు పట్టణం 5వ వార్డులో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.