తిరుపతిలో పౌరహక్కుల సంఘం చర్యలపై తీవ్ర విమర్శ

శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు శనివారం మాట్లాడుతూ, తిరుపతిలో పౌరహక్కుల సంఘం చేపడుతున్న చర్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. దేశ గౌరవాన్ని అవమానించేలా అశోక సింహ ముద్రను చెడగొట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని, ఇది జాతీయ గౌరవ అవమానాల నివారణ చట్టం–1971 ప్రకారం నేరమని ఆయన పేర్కొన్నారు. హిందూ మతాన్ని అవమానించే వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే బ్యానర్లు తొలగించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్