శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల నుంచి వస్తున్న నీటి ధారలు పెద్ద కెరటంలా కిందకు పడుతున్నాయి. నీటి తుంపర్లు ఘాట్ రోడ్లపై వర్షంలా పడుతున్నాయి. ఈ దృశ్యాలను చూడేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి దృశ్యం కృత్రిమ వర్షపాతాన్ని తలపించింది.