వెలుగోడు పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు జరిపారు. దుర్గాభవాని ఎరువుల దుకాణంలో రూ. 13 లక్షల విలువైన ఎరువులకు సంబంధించి విక్రయాలను ఆపేసినట్లు ఏవో స్వామి తెలిపారు. అనుమతులు లేని ఎరువులు, మందులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. విజిలెన్స్ అధికారులు ప్రసాద్, శ్రీనివాసులు, ఆత్మకూరు ఏడీఎ శశికళ, సిబ్బంది పాల్గొన్నారు.