పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముఖద్వారం పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను పెంచినట్లు జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నాటికి 20వేల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ 2,4,5,6 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ కాలువలోకి విడుదల చేస్తున్నారు. బనకచర్ల కాంప్లెక్స్ నుంచి వెలుగోడు, తెలుగుగంగ జలాశయానికి మరియు కేసీ కాలువలకు అధికారులు నీటిని మళ్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్