కుటుంబానికి అండగా తొమ్మిదో తరగతి విద్యార్థి

ఎమ్మిగనూరు మండలం కలగట్లకు చెందిన 13 ఏళ్ల వీరేంద్ర అనే 9వ తరగతి విద్యార్థి తన కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరులో వలస పనుల్లో ఉండగా, సెలవులను వృథా చేయకుండా ఆదోని, ఎమ్మిగనూరు వారపు సంతల్లో తాళాలు, సెల్‌ఫోన్ స్టాండ్లు అమ్ముతున్నాడు. ఆన్‌లైన్‌లో హోమ్ డెకరేషన్ వస్తువులు కొనుగోలు చేసి నేరుగా విక్రయిస్తూ, ఆ ఆదాయంతో కుటుంబ అవసరాలు తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సంబంధిత పోస్ట్