హాలహర్వి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయుల నియామకం

నందవరం మండలం హాలహర్వి గ్రామ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటంతో ఏర్పడిన సమస్యపై సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ బి. వి. జయనాగేశ్వర రెడ్డి స్పందించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీంతో కే. ఖాజా హుస్సేన్, కే. సురేఖలను డిప్యుటేషన్‌పై పాఠశాలకు నియమించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, నియోజకవర్గంలోని పాఠశాలల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్