ఎమ్మిగనూరు పట్టణంలోని సమస్యలపై చర్చించేందుకు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం వాడీవేడిగా మారింది. వైసీపీ కౌన్సిలర్, బీజేపీకి చేరిన 21వ వార్డు కౌన్సిలర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దయాసాగర్ వార్డు సమస్యలపై ఎక్కువ సమయం తీసుకోవడంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ డిష్ కేశవ రెడ్డి అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అగ్రహంతో సభ్యులు మిన్నకుండిపోయారు.