బనవాసి: ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జేసీ

ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో సాగు రంగం నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్