ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు పోలీసుల అండ ఉందని టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆరోపించారు. యువత, కుటుంబాలు బెట్టింగ్ తో నాశనమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల డీఎస్పీ భార్గవి బెట్టింగ్ ముఠాను పట్టుకొని రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపినా, నిందితులను మీడియాకు చూపించలేదని విమర్శించారు. ఈ ఆరోపణలు పట్టణంలో కలకలం రేపుతున్నాయి.